రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి

రాయపర్తి, ఆంధ్రప్రభ : రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మహబూబ్‌నగర్, బంధనపల్లి, కొత్తూరు, ఏకే తండా, సూర్య తండా, పెరికవేడు, కొండాపురం, ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి, సన్నూరు, వెంకటేశ్వర పల్లి గ్రామాలలో స్థానిక సర్పంచులతో కలిసి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ 2025-26 సీజన్‌లో రైతులు దళారులను ఆశ్రయించి, మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2389/-, సాధారణ రకం ధాన్యానికి రూ. 2369/- కనీస మద్దతు ధర ప్రకటించినట్లు చెప్పారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరుగుతాయని హామీ ఇచ్చారు.ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగులు, నీటి వసతి, నీడ, టార్పాలిన్ కవర్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, సన్నాలకు బోనస్, మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తూ ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈవోలు ఉడుత సాయి కుమార్, కురుమ క్రాంతి కుమార్ ఐకెపి సీసీలు గుండ సుధాకర్,బాలగాని సమ్మయ్య,ఆయా గ్రామాల సర్పంచులు పెండ్లి మహేందర్ రెడ్డి,గుగులోతు అక్రి నాయక్,కందికట్ల స్వప్న, హళావత్ సోమ్లా,మునావత్ బానిషా,తీగల సాయిలు గౌడ్,కనుకుంట్ల మంజుల,బానోతు లాలి, చెవ్వు హేమలత,బద్దం సుగుణమ్మ,చినపాక రజిత,సంకినేని సారయ్య,గారే సహేంద్ర బిక్షపతి,మునావత్ రఘు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఎండి నయీమ్, ఏఎంసీ డైరెక్టర్ పుల్లూరి దామోదర్,ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు,మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, ఐకెపి కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply