గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం….

గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకం….
నల్లగొండ ఎంపీడీవో యాకూబ్ నాయక్
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని నల్లగొండ ఎంపీడీవో భూక్య యాకూబ్ నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నిక కాబడిన 16 గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్లకు ఏర్పాటుచేసిన రెండో రోజు శిక్షణలో మాట్లాడారు.
వార్డ్ మెంబర్లకు పంచాయతీ వ్యవస్థ పలు బాధ్యతలు కట్టబెట్టిందని వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆర్థిక వివరాలు, అభివృద్ధి పథకాల అమలు, ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవగాహన కార్యక్రమం కల్పిస్తామని పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల పరిపాలనలో నియమ నిబంధనలను పాటిస్తూ గ్రామాల యొక్క సుస్థిర అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీఓ ఇస్మాయిల్ , ట్రైనర్ లు వెంకన్న, రాజశేఖర్, గీతాంజలి, రాజేందర్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు మహమూద్, ఫారుఖ్, అనిల్, మౌనిక, సంధ్య, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
