ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి భావగర్భితంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధికి, ఆధునీకరణకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని కొనియాడారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంతో పాటు యువతకు, మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేసిన మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీమనపల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వట్టికోటి శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి పాల్గొన్నారు. అలాగే సర్పంచులు జాల జంగయ్య, కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, గోపగోని పాపయ్య గౌడ్, మాజీ సర్పంచులు మాధగోని రాజేష్ గౌడ్, జాల వెంకటేశ్వర్లు, పందుల భాస్కర్, ఆనగంటి కృష్ణ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply