ప్రజావాణి కార్యక్రమంలో వీఆర్ఏ నియామకంపై ఫిర్యాదు

ప్రజావాణి కార్యక్రమంలో వీఆర్ఏ నియామకంపై ఫిర్యాదు

-ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించిన జోగు కుమార్
-గొడుగు అనిల్ ఉద్యోగంపై విచారణ కోరిన గ్రామస్థుడు
-వీఆర్ఏ ఉద్యోగం అక్రమంగా పొందినట్లు ఆరోపణ
-అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ:

స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మీదికొండ గ్రామానికి చెందిన జోగు కుమార్ స్థానిక ఎమ్మార్వోకు అదే గ్రామానికి చెందిన గొడుగు అనిల్ వీఆర్ఏ ఉద్యోగ నియామకంపై ఫిర్యాదు చేశారు.

గొడుగు అనిల్ వీఆర్ఏగా ప్రభుత్వ ఉద్యోగాన్ని అక్రమ పద్ధతిలో పొందినట్లు ఆరోపించారు. గత 12 సంవత్సరాలుగా వీఆర్ఏగా విధు లు నిర్వహిస్తూ, సుమారు మూడు సంవత్సరాల క్రితం రెవెన్యూ శాఖ లో జూనియర్ సహాయకుడిగా పదోన్నతి పొందిన విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. అక్రమంగా ఉద్యోగం పొంది నట్లు తేలితే సంబంధిత వ్యక్తిని విధుల నుంచి తొలగించడంతో పాటు, ఇప్పటివరకు ప్రభుత్వంచే పొందిన జీతభత్యాలను తిరిగి వసూలు చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply