పెద్దపల్లి ఆంధ్రప్రభ – రాష్ట్రంలో పనిచేస్తున్న 15 మంది డిఎస్పి లకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 15 మంది డిఎస్పి లకు పదోన్నతి కల్పిస్తూ డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
