PBKS vs RCB Qualifier-1 | జోరుమీదున్న ఆర్సీబీ.. కష్టాల్లో పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్ లో బెంగ‌ళూరు జట్టు జోరు క‌న‌బ‌రుస్తుంది. ఫైనల్స్ కు చేరుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉన్న పంజాబ్ – ఆర్సీబీ జట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడుతున్నాయి. కాగా, పంజాబ్ జ‌ట్టు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తుంది.

అయితే, ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల‌లాడుతోంది. స్వ‌ల్ప‌ పరుగులకే… వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. పంజాబ్ 6.3 ఓవర్లలో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

తొలి వికెట్ గా ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (7), ఆ తర్వాత ప్రభామన్ సింగ్ (18), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (2), జోస్ ఇంగ్లిస్ (4), నెహాల్ వధేరా (8) ఇలా స్వ‌ల్ప ప‌రుగుల‌కే వెనుదిరిగారు.

ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్ రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టగా.. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు.

Leave a Reply