Survey Report | ఏసీబీకి చిక్కిన తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్..

Survey Report | ఏసీబీకి చిక్కిన తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్..

Survey Report | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న అధికారి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రామకృష్ణ అనే రైతుకు ఒక స్థలానికి సంబంధించి సర్వే రిపోర్టు ఇవ్వడానికి రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. మంగళవారం రామకృష్ణ తన నివాసంలో ఆ నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం రామకృష్ణ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.