పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86 విద్య సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు కలుసుకొని తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు చెన్న కిష్టారెడ్డి, శివన్న, మనోహర్ రావు, వనజమ్మలకు పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 40 సంవత్సరాల తరువాత కలుసుకున్న మిత్రులు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పూర్వ విద్యార్థులు అబ్దుల్ జబ్బార్, దత్తాచారి, ఆంజనేయులు, కృష్ణయ్య, కృష్ణా రెడ్డి, వహీద్, శ్రీనివాస్ గౌడ్, యూసుఫ్ పాషా, వెంకటేశ్వర రెడ్డి, శాయి రెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్ రబ్, పాషా, విష్ణుమూర్తి, భాగ్యమ్మ, సుగుణ తదితరులు ఉన్నారు.

Leave a Reply