ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం విద్యార్థుల ర్యాలీ..

వర్ని, ఆంధ్రప్రభ : ప్లాస్టిక్ రహిత గ్రామంగా వర్ని మండల కేంద్రాన్ని తీర్చిదిద్దాలని కోరుతూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ర్యాలీగా పర్యటించారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించే ప్లకార్డులను ప్రదర్శించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కనక దుర్గ రవి, వార్డు సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.