Miss World Finals | ఉత్కంఠంగా మిస్ వరల్డ్ ఫైనల్స్

  • ఖండాల వారీగా టాప్ 5 ఎంపిక
  • మిస్ ఇండియా నందిని గుప్తాకు నిరాశ

హైద‌రాబాద్ : హైటెక్స్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీ ఉత్సాహంగా మారుతోంది. నిర్వాహకులు ఖండాల వారీగా టాప్ 5 ఫైనలిస్టులను ఎంపిక చేశారు.

ఖండాల వారీగా ఎంపికైన టాప్ 2 ఫైనలిస్టులు:

అమెరికా ఖండం నుంచి:

మార్టినిక్
బ్రెజిల్

ఆఫ్రికా ఖండం నుంచి:

ఎథియోపియా
నమీబియా

యూరప్ ఖండం నుంచి:

పోలెండ్
ఉక్రెయిన్

ఆసియా ఖండం నుంచి:

ఫిలిప్పీన్స్
థాయిలాండ్

ఒక్కో ఖండం నుంచి ఎంపికైన టాప్ 2 ఫైనలిస్టుల్లో ఒక్కరిని మాత్రమే తుది దశకు ఎంపిక చేస్తున్నారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం. అభ్యర్థుల సమాధానాల ఆధారంగా జడ్జ్‌లు మార్కులు ఇవ్వడం ద్వారా చివరి ఎంపిక చేపడుతున్నారు.

మిస్ ఇండియా నందినికి నిష్క్రమణ

భారతదేశం తరపున పోటీ పడుతున్న మిస్ ఇండియా నందిని గుప్తా షార్ట్‌లిస్టింగ్ ఎలిమినేట్ అవ్వ‌డం అభిమానులను నిరాశకు గురిచేసింది.

Leave a Reply