Distribution 2500 | మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత

Distribution 2500 | మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత

Distribution 2500 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటన రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు రూ.2,500 పంపిణీ అంశంపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మంత్రిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హామీల అమలుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీనికి ప్రతిగా మంత్రి వివేక్ స్పందిస్తూ… గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు.

దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మధ్యలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జోక్యం చేసుకుని ఇరువురిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఈ ఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారితీసింది.

Leave a Reply