శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ (కనేకల్ క్రాస్)లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. సుప్రభాత సేవలో భాగంగా అర్చకులు లక్ష్మీ కాంతారావు, సాయి స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, అర్చనలు పూజ కార్యక్రమాలను నిర్వహించారు.
మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట చేసి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈనెల 7వ తేదీన స్వామివారి ఆలయంలో మండల పూజ కార్యక్రమాలను నిర్వహించడానికి, భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు.
