91. పదన్యాసక్రీడాపరిచయమివారబ్ధుమనసః
స్ఖలంతస్తేఖేలంభవనకలహంసా న జహతి
అతస్తేషాంశిక్షాం సు(శు)భగ మణిమంజీరరణిత
చ్ఛలాదాచక్షాణంచరణకమలంచారుచరితే.
తాత్పర్యం: మనోహరమైన నడవడిక గల దేవీ! నీ పాదవిన్యాస, క్రీడాభ్యాసాలని తాము కూడ పొందాలనుకొని నీ భవనంలో ఉన్న పెంపుడు రాజహంసలు తడబడుతూ నీ విలాసగమనాన్ని వదలలేక పోతున్నాయి. అందువల్ల నీ పాదపద్మం శుభప్రదమైన మణిమయమైన అందెల చిరుసవ్వడులు అనే నెపంతో ఆ రాజహంసలకు అందమైన నడకకు ( నడతకు) సంబంధించిన శిక్షణ నిస్తున్నట్టు ఉంది.