సీపీఐలో సామాజిక నాయకుల చేరిక..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సిపిఐ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీగా,స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వస్తోందని సిపిఐ జిల్లా మండలి సభ్యుడు చింతకిండి కుమారస్వామి తెలిపారు.మండలానికి చెందిన సామాజిక,ప్రజాసంఘాల నాయకులు. బట్టు సాంబయ్య,పరికి కోర్నేల్, మామిండ్ల పెద్ద అయిలయ్య, కన్కం సాల్మన్, కన్కం కోర్నేల్‌లు సోమవారం పార్టీ కార్యాలయంలో కుమారస్వామిని కలిసి పార్టీలో చేరగా,ఆయన వారికి కండువులు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ,అణగారిన వర్గాల విముక్తి కోసం సిపిఐ కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.ఇక నూతనంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు,మద్యం ఆధారిత వ్యవస్థ పెరిగిందని విమర్శించారు. పేదలు,బీసీ,ఎస్సీ,ఎస్టీలకు న్యాయం జరిగే వేదికగా సిపిఐని భావించి చేరినట్లు తెలిపారు. భవిష్యత్తులో పేదల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతులు,వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, యువత సిపిఐలో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.
