Sanitation | పడకేసిన పారిశుధ్యం…..
Sanitation | పడకేసిన పారిశుధ్యం…..
- పల్లె భారం అంతా పంచాయతీ కార్యదర్శులపైనే..
- ఏడాదిగా నెట్టుకొస్తున్న కార్యదర్శులు..
- గ్రామాలకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం..
- జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో జీపీలు..
- పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు…
- పల్లెల్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి..
చౌడాపూర్, (ఆంధ్రప్రభ) : గ్రామపంచాయతీల్లో పైసలు లేక గ్రామాల్లో చెత్త సేకరణ చేయకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లు నిలిపివేసారు. చౌడాపూర్ మండల కేంద్రంలో భజ్య నాయక్ తండాలో కొన్ని నెలలుగా గ్రామపంచాయలో నిధులు లేక ట్రాక్టర్ రిపేరుకు వచ్చి ట్రాక్టర్ నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభు త్వంలో గ్రామాలు నిర్ధారణకు గురవుతున్నాయి.
స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమ స్యలు అక్కడే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధు లు లేవు. ప్రజాప్రతినిధులు లేరు. ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడాని కి పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి చేస్తున్నారు.
ఇక గ్రామాల భారం మోయలేమని పంచాయతీ కార్యదర్శు లు మొత్తుకుంటున్నారు. గ్రామాలకు నియమించిన ప్రత్యే కాధికారులు కానరావడం లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందరంగా పంచాయతీ కార్యదర్శుల పరిస్థి తి నెలకొంది. గ్రామాలను పట్టించుకునే వారు కరువయ్యారు.
బీఆర్‌ఎస్ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ, స్థానిక సంస్థల వ్యవహారాల పర్యవేక్షణకు వేరు వేరుగా అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి పర్యవేక్షణ అంతంత మాత్ర ంగానే మారింది. చౌడాపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలు ప్రస్తుతం నిధులలేమితో కొట్టు-మిట్టాడుతున్నాయి.
జాడలేని ప్రత్యేకాధికారులు..
చౌడాపూర్ మండలంలో గ్రామాల పరిస్థితి అస్తవ్య స్తంగా తయారైంది. మండల, గ్రామాల పాలక వర్గాల గడు వు పూర్తయి రెండు సంవత్సరాలు గడుస్తున్న గ్రామ పంచా యతీల పాలకవర్గం గడువు ముగిసింది. గడువు ముగియ గానే గ్రామాలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియ మించింది.
వీరిని నియమించినా భారమంతా పంచాయ తీ కార్యదర్శుల మీదనే పడుతున్నది. గ్రామాలకు నియ మించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువైంది. కనీసం వారికి కేటాయించిన గ్రామాలకు రావడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. పర్యవేక్షణ లేక గ్రామాల్లో సమస్యలు రాజ్య మేలుతున్నాయి.
తాము గ్రామాలకు ప్రత్యేకాధికారులం అని చెప్పి అటు గ్రామాలకు వెళ్లడం లేదు. ఇటు వారి సొంత శాఖలో డ్యూటీలు నిర్వహించడం లేదు. పూర్తిగా ఉద్యోగ బాధ్యతలను వదిలి సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా ప్రభుత్వ వేతనం తీసుకుంటూ తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమం గా నిర్వర్తించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కాలక్షేపం, సొంత వ్యాపారాలకే ప్రభుత్వ ఉద్యోగులు పరి మితం అవుతున్నారన్న విమర్శలు చౌడాపూర్ మండల వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆఫీసు సమయంలో సైతం చాలామంది అధికారులు కార్యాలయాల్లో ఉండడం లేదని తెలిసింది. తీసుకునేది ప్రభుత్వ జీతం… చేసేది ప్రైవేట్ వ్యాపారాలు ఇది కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల తీరు ఉంది. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు రాక పోవడంతో ఆ భారమంతా పంచాయతీ కార్యదర్శులు మీదనే పడుతున్నది.
నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న పల్లెలు…
రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం తో మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు నిధుల లేమి తో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గ్రామాలకు మూడు రకాల ఖాతాలు ఉంటాయి. వీటిలో ఒకటి ఆస్తి పన్ను జమ చేసుకునే ఖాతా.. గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలు చేసి ఆ ఖాతాలో జమ చేస్తారు.
ప్రస్తుత పరిస్థితు ల్లో ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలు అవుతున్నా యి. గ్రామాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక రెండో ఖాతా ఎస్‌ఎఫ్‌సీ ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులను జమ చేస్తారు. కొన్ని నెలలుగా రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈ ఖాతా పూర్తిగా ఖాళీగానే ఉంది.
మూడో ఖాతా ఆర్థిక సంఘం సంబంధించినది. దీనిలో కేంద్ర ప్రభు త్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేస్తుంది. గ్రామాల్లో ఉండే జనాభా ప్రతిపాదికన ఈ నిధులను జమ చేస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి నిధులు జమ అవుతాయి. వీటిని గ్రామాల్లో ప్రత్యేక పను లకు ఖర్చు చేసుకుంటారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెలా పల్లె ప్రగతి కింద నిధులను విడుదల చేసింది. మండలంలో అన్ని గ్రామాలు పల్లె ప్రగతి ద్వారా అద్భుత ప్రగతిని సాధిం చాయి. అన్ని గ్రామాలు పురోగతి దశలో పయనించాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యా చరణ అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపించింది.
పల్లె ప్రగతిలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇవి కాకుండా గ్రామాల్లో పన్నుల ద్వారా ఇతరత్రా ఆదాయం వచ్చేది. ఈ నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగ తి కింద విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఫలితంగా గ్రామాలు శుభ్రంగా ఉండేవి.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి జనాభా లెక్కల ప్రకారం అభివృద్ధి నిధుల ను ప్రతినెలా కేటాయించింది. ప్రతి ఊరికి డంపింగ్ యా ర్డు, హరిత హారంలో విరివిగా మొక్కలు నాటించింది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనిచ్చింది. త్రాగునీటి స మస్య లేకుండా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందించారు.
పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి చేయడంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లాలోని అనేక గ్రామాలు అవా ర్డులు సాధించాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటు-బడింది. సమస్యలతో ప్రజలు సతమతమవు తున్నారు. గ్రామ స్వరాజ్య లక్ష్యం దెబ్బతింటున్నది.
