RTA | 150 బస్సులపై కేసు – 35 బస్సులు సీజ్
RTA | 150 బస్సులపై కేసు – 35 బస్సులు సీజ్
RTA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆర్టీఏ అధికారులు సోమవారం వెయ్యికి పైగా విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటించని, అనుమతులు మరియు ఫిట్‌నెస్ నిబంధనలను ఉల్లంఘించిన 150కు పైగా బస్సులపై కేసులు నమోదు చేశారు.
అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా నడుస్తున్న 35 విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
పాఠశాల, కళాశాల యాజమాన్యాలు వాహనాల నిర్వహణ, ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగనున్నట్లు తెలిపారు.
