polling, counting | ప్రశాంతంగా చివరి విడత..

polling, counting | ప్రశాంతంగా చివరి విడత..

  • స‌ర్పంచ్ ఎన్నిక‌లు
  • జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
  • కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి
  • ఎన్నికల సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
  • ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు

polling, counting | మక్తల్, ఆంధ్ర‌ప్ర‌భ : నారాయణపేట జిల్లాలోని చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణ, నర్వ మండలాల్లో ఎన్నికల పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల(Polling centers) వద్ద బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన ఉట్కూర్, మల్లెపల్లి, చినపొర్ల, కాచ్వర్, జక్లేర్, మంథన్ గోడ్, కాట్రేవుపల్లి, భూత్పూర్ తదితర పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్తు(police security) ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని తెలిపారు.

అదేవిధంగా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సెన్సిటివ్(sensitive), హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతిభద్రతలను కాపాడడంలో ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా ఉండాలని తెలిపారు.

ఐదు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, కౌంటింగ్ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండి కట్టుదితమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్, కౌంటింగ్(polling, counting) సమయంలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.

Leave a Reply