మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఉత్తమ ప్రతిభ
- డా. పత్తన్ ఆఫ్రీన్‌కు ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్స్
(విజయవాడ, ఆంధ్రప్రభ) : డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన పట్టభద్రుల స్నాతకోత్సవంలో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డా. పత్తన్ ఆఫ్రీన్ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థిగా గుర్తింపు పొందిన ఆమె, తన అకాడమిక్ ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
సమారోహంలో భాగంగా డా. ఆఫ్రీన్‌కు లేట్ డా. కె.ఎం. గాంధీ గోల్డ్ మెడల్‌తో పాటు డా. పతురు రామచంద్ర రెడ్డి స్మారక పతకాన్ని ప్రదానం చేశారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆమె వైద్య విద్యలో చూపిన కృషి, నిబద్ధత మరియు అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా నిలిచాయి. క్యారింగ్ మేనేజ్‌మెంట్, ప్రిన్సిపల్ మరియు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ విభాగాధిపతి ఆమె సాధనపై అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
