శ్రీశైలం క్షేత్రంను దర్శించుకున్న బిజెపి నాయకులు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు దర్శించుకున్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. సదానంద్ రెడ్డి నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు అమరేందర్ రెడ్డి, ఎంకేపల్లి సర్పంచ్ దయాకర్, వికారాబాద్ మండల బీజేపీ అధ్యక్షుడు కామారెడ్డి, గూడ ఉపసర్పంచ్ శివరాజ్ గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ప్రార్థించారు.

Leave a Reply