Revanth Reddy | సదర్ మట్ బ్యారేజ్ ను ప్రారంభించిన సీఎం

Revanth Reddy | సదర్ మట్ బ్యారేజ్ ను ప్రారంభించిన సీఎం
Revanth Reddy | నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని గోదావరి నది పై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్ ను శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారేజ్ కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఓపెన్ చేసి.. బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతించారు.
ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేసి.. ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన ముగియడంతో అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు (Ministers) ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, సంజయ్ కుమార్ ,రామారావు పటేల్ ,సర్పంచ్ చిట్యాల లక్ష్మి, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ,ఎస్పీ జానకి షర్మిల, ఆయా శాఖల అధికారులు ,నాయకులు పాల్గొన్నారు.
CLICK HERE TO READ చెనాకా కోరాటా బ్యారేజీ, సదర్ మార్ట్ ప్రాజెక్టులకు శ్రీకారం
