సిఐ నాగరాజు కు న్యాయం చెయ్యాలి..

సిఐ నాగరాజు ను వెంటనే విడుదల చెయ్యాలి..
గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌ల‌ను పోలీస్‌లు అదుపు చెయ్యాలి..
సిఐ, నాగరాజుకు మద్దతుకు గా రాణిగారి తోట లో మహిళ చే కోవత్తుల ర్యాలీ..

విజయవాడ కృష్ణలంక, ఆంధ్రప్రభ : విజయవాడ నగర పరిధిలోని రాణిగారి తోటలో కృష్ణలంక మాజీ పోలీసు ఇన్స్పెక్టర్ నాగ రాజు అరెస్టుకు మద్దతుగా ఈ రోజు సాయంత్రం రాణిగారి తోట మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సి ఐ నాగరాజుకు మద్దతుగా రాణి గారి తోట సిమెంట్ గోడౌన్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్హించారు.

ఈ ర్యాలీలో కృష్ణలంక రాణి గారి తోట, కృష్ణలంక ప్రాంత స్థానిక ప్రజలు నాగరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు.