RCB vs DC | టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే !

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు నేడు బెంగళూరు వేదిక‌గా పోటీ పడనున్నాయి. కాగా, ఈ సీజన్‌లో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ, రజత్ పాటిదార్ సార‌థ్యంలోని ఆర్సీబీ విజయాల బాటలో అడుగులేస్తున్నాయి. ఈ రెండు జట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ.. పాయింట్ల పట్టికలో 6 పాయింట్ల‌తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

కాగా, బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ మాట్లాడుతూ ఫీల్డింగ్ చేయ‌నున్న‌ట్టు తెలిపాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

తుది జ‌ట్లు :

ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

అయితే, ఢిల్లీ ఆడిన మూడు మ్యాచుల్లో వ‌రుసగా విజ‌యాలు సాధించి గెలుపు జోష్ మీదుంది. మ‌రోవైపు ఆర్సీబీ నాలుగు మ్యాచులు ఆడ‌గా… హోం గ్రౌండ్ వేదిక‌గా జ‌రిగిన‌ మూడో మ్యాచ్ లో జీటీపై ఓట‌మిపాలైంది. ఇక తిరిగి విజ‌యాల బాట‌లో అడుగులు వేసిన ఆర్సీబీ.. అదే ఫామ్ ను కొన‌సాగించాల‌ని భావిస్తోంది.

ఐపీఎల్ టోర్నీల్లో ఆర్‌సిబి – డీసీ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 31 మ్యాచ్‌ల్లో ఆర్‌సిబి జట్టు 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా డీసీ జట్టు 11 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి. రెండు జట్లు బలాబలాల ప‌రంగా ఇరు జ‌ట్లు ప‌టిష్టంగా ఉండ‌టంతో నేటి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *