కుటుంబ స్వయం ఉపాధికి తోపుడు బండి అందజేత..
పాయకాపురం, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు అండగా పి.4పథకం స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని టీడీపీ యువ నాయకుడు,పి.4 మార్గదర్శి బొండా సిద్దార్ధ అన్నారు.సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పి.4 పథకంలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో 25వ డివిజన్‌కు చెందిన కొలను సరస్వతికి తోపుడు బండిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల పావని, మాచర్ల గోపి, దొంగరాంజనేయులు, స్థానిక డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
