Prices | రెండేళ్ల నిషేధంపై కేంద్రం ఆలోచన

Prices | రెండేళ్ల నిషేధంపై కేంద్రం ఆలోచన

Prices | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, దిగుమతి ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా భారీ నిర్మాణ పనులను రెండేళ్ల పాటు నిలిపివేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై కేంద్రం కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, దిగుమతి వ్యయాలు అధికమవడంతో పెద్ద ప్రాజెక్టుల అమలు భారంగా మారుతున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని నీతి ఆయోగ్ సూచించినట్లు సమాచారం.

నీతి ఆయోగ్ సిఫార్సుల నేపథ్యంలో సెంట్రల్ సెక్రటేరియట్ పునర్నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply