తీరప్రాంత గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
నర్సాపురం, ఆంధ్రప్రభ : తీరప్రాంత గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు నర్సాపురం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మధుకుమార్ తెలిపారు. 33 కేవీ తూర్పు తాళ్లు ఫీడర్ పరిధిలో ట్రీ కటింగ్ పనులు చేపడుతున్నందున విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
నర్సాపురం మండలంలోని తూర్పు తాళ్లు, లింగబోయించర్ల, పెదమైనవానిలంక, వేములదేవి, కాపులకడప, చామకూరివారిపాలెం, కొండవీటికొడప, బియ్యపుతిప్ప గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేస్తున్నామని, ఆయా గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మధుకుమార్ కోరారు.
