No More Nba Legend : ఎన్బీయే… గే లెజెండ్ ఇకలేరు Andhra Prabha Top Story

No More Nba Legend : ఎన్బీయే… గే లెజెండ్ ఇకలేరు Andhra Prabha Top Story
- భాస్కట్బాల్ ధీర.. కన్నుమూత
- 8 నెలల మృత్యుపోరాటం
- తొలి గే క్రీడాకారుడిగా చరిత్ర
- స్టేజ్ 4 గ్లియోబ్లాస్టోమాతో ఆఖరి పోరాటం
- కడవరకూ బ్రన్సన్ గ్రీన్తోడూనీడ
- NBA కేర్స్ రాయబారిగా సమ్మిళితత్వానికి సేవలు
- LGBTQ+ కమ్యూనిటీకి వరల్డ్ వాయిస్
- క్రీడల్లో వివక్ష వ్యతిరేక ఉద్యమనేత
- యువ ఆటగాళ్ల లెజెండ్
- గ్లెన్ బర్క్ అడ్వకేసీ అవార్డుకు ఇటీవల ఎంపిక
(ఆంధ్రప్రభ, లాస్ ఏంజెల్స్ )

క్రీడారంగంలో జాతి, లింగ వివక్ష వ్యతిరేకి.. ప్రపంచ బాస్క్బాల్ ప్రేమికులకు అత్యంత ఆత్మీయుడు.. సామాజిక దృక్ఫథ వాది.. NBAలో బహిరంగంగా స్వలింగ సంపర్కుడిగా తనకు తాను ప్రకటించుకున్న తొలి గే స్పోర్ట్స్ లెజెండ్ స్టార్ జాసన్ కాలిన్స్ ఇకలేరు . 8 నెలలుగా మెదడులో కణితితో పోరాడిన జాసన్ మే 12, 2026న లాస్ ఏంజిల్స్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. బాస్కెట్ బాల్ క్రీడాకారులు, జట్ల సమ్మిళితత్వానికి మార్గదర్శకుడిగా .. లీగ్‌కు రాయబారిగా ఎదిగిన జాసన్ కాలిన్స్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. NBA చరిత్రలో తొలి బహిరంగ స్వలింగ సంపర్క క్రీడాకారుడిగా నిలిచిన జాసన్ కాలిన్స్ (Jason Collins), మే 12, 2026న తన 47వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన గత ఎనిమిది నెలలుగా అత్యంత ప్రమాదకర స్టేజ్ 4 గ్లియోబ్లాస్టోమా (Stage 4 Glioblastoma) అనే మెదడు కణితితో మృత్యువుతో పోరాడుతూ మరణించినట్లు ఆయన కుటుంబం, NBA అధికారికంగా ప్రకటించాయి. 2025 ఆగస్టు లో హాలీవుడ్ చిత్ర నిర్మాత బ్రన్సన్ గ్రీన్ ను పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే కాలిన్స్ లో అసాధారణ లక్షణాలను గమనించారు. సెప్టెంబర్‌లో ఆయన మెదడు లో కణితి ఉందని తెలిసింది. ఆ తర్వాత డిసెంబర్లో అది ‘స్టేజ్ 4 గ్లియోబ్లాస్టోమా’ అని ధృవీకరించారు. ఈ వ్యాధికి చికిత్స కోసం ఆయన సింగపూర్‌కు వెళ్లి ప్రయోగాత్మక కీమోథెరపీని కూడా తీసుకున్నారు. ఒకానొక సమయంలో ఆయన కోలుకుంటున్నట్లు కనిపించింది, ఫిబ్రవరిలో ‘NBA ఆల్-స్టార్ వీకెండ్’ ఈవెంట్లకు కూడా హాజరయ్యారు. ఇటీవల క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో పరిస్థితి విషమించింది.
No More Nba Legend : స్సోర్ట్స్ లోనే.. గే లెజెండ్…

2013లో ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను గే అని ప్రకటించి, అమెరికాలోని ప్రధాన నాలుగు ప్రొఫెషనల్ క్రీడలలో (NBA, NFL, MLB, NHL) తన అస్తిత్వాన్ని బహిరంగంగా చాటుకున్న తొలి యాక్టివ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు. కాలిన్స్ 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో న్యూజెర్సీ నెట్స్ (ఇప్పుడు బ్రూక్లిన్ నెట్స్), అట్లాంటా హాక్స్, బోస్టన్ సెల్టిక్స్ వంటి ఆరు జట్ల తరపున ఆడారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ‘NBA కేర్స్’ రాయబారిగా సమ్మిళితత్వానికి (Inclusion) కృషి చేశారు.
No More Nba Legend : తుది ప్రస్థానం

NBA క్రీడాకారుడు జాసన్ కాలిన్స్ హాలీవుడ్ చలనచిత్ర నిర్మాత బ్రన్సన్ గ్రీన్ (Brunson Green) ను వివాహం చేసుకున్నారు. బ్రన్సన్ గ్రీన్ ‘ది హెల్ప్’ (The Help) వంటి ప్రసిద్ధ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2025 మే లో టెక్సాస్‌లోని ఆస్టిన్ (Austin) లో ఒక ప్రైవేట్ బహిరంగ వేడుకలో వీరు ఒక్కటయ్యారు. 2013లో తాను స్వలింగ సంపర్కుడినని కాలిన్స్ ప్రకటించిన కొద్దిరోజులకే ఒక పార్టీలో బ్రన్సన్ గ్రీన్‌ను కలిశారు.వీరు సుమారు 10 ఏళ్లకు పైగా సహజీవనం చేశారు. 2023లో లాస్ ఏంజిల్స్ లేకర్స్ ‘ప్రైడ్ నైట్’ (Pride Night) సందర్భంగా నిశ్చితార్థం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఆస్కార్ విజేత ఆక్టేవియా స్పెన్సర్ (Octavia Spencer), అల్లిసన్ జానీ వంటి ప్రముఖ హాలీవుడ్ నటీమణులు , కాలిన్స్ సహచర క్రీడాకారులు హాజరయ్యారు.
No More Nba Legend : కడవరకూ వీడని తోడు

పెళ్లి జరిగిన కొన్ని నెలలకే (సెప్టెంబర్ 2025లో) కాలిన్స్ మెదడులో కణితి (Glioblastoma) ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. చికిత్స పొందుతున్న ఆ ఎనిమిది నెలల క్లిష్ట సమయంలో బ్రన్సన్ గ్రీన్ అండగా నిలిచారు. తన చివరి రోజుల్లో కాలిన్స్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, “నా జీవితంలో అత్యంత ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నా జీవితంలో అత్యంత అద్భుత విషయం” అని పేర్కొన్నారు..
No More Nba Legend : సామాజిక ధీర

జాసన్ కాలిన్స్ బాస్కెట్‌బాల్ క్రీడలోనే కాకుండా, సామాజిక మార్పు కోసం క్రీడలలో సమ్మిళితత్వం (Inclusivity) కోసం ఒక శక్తివంత రాయబారిగా (Ambassador) విశేష కృషి చేశారు. రిటైర్ మెంట్ తర్వాత, కాలిన్స్ NBA అధికారిక సామాజిక సేవా విభాగ NBA కేర్స్ (NBA Cares) కు గ్లోబల్ అంబాసిడర్‌గా పనిచేశారు. క్రీడలతో ప్రజలను ఏకం చేయడం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు బాస్కెట్‌బాల్ శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. NBA , WNBA లలో భవిష్యత్తు తరాల కోసం మరింత సానుకూల , వివక్ష లేని వాతావరణాన్ని సృష్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేవలం ఒక క్రీడాకారుడిగానే కాకుండా, LGBTQ+ కమ్యూనిటీ తరపున వరల్డ్ వాయిస్ గా నిలిచారు. గత ఎనిమిది ఏళ్లుగా, NBAలోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు (Rookies) హోమోఫోబిక్ భాష (అపహాస్యం చేసే మాటలు) వాడకూడదని , డ్రెస్సింగ్ రూమ్‌లలో అందరినీ గౌరవించే సంస్కృతిని ఎలా పెంచాలో శిక్షణ ఇచ్చారు.అథ్లెట్ అలీ (Athlete Ally): క్రీడలలో స్వలింగ సంపర్కుల పట్ల వివక్షను తొలగించడానికి పనిచేసే ‘అథ్లెట్ అలీ’ అనే సంస్థకు ఆయన రాయబారిగా వ్యవహరించారు. 2025లో జరిగిన ‘ఫైనల్ ఫోర్’ వంటి ఈవెంట్లలో LGBTQ+ యువత కోసం ప్రత్యేక బాస్కెట్‌బాల్ క్లినిక్స్‌ను నిర్వహించి, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వ హయాంలో “President’s Council on Fitness, Sports, and Nutrition” లో సభ్యుడిగా అమెరికన్లలో ఫిట్నెస్ , సరైన పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఆయన కృషికి GLSEN నుండి ‘కరేజ్ అవార్డు’ అందుకున్నారు 2026లో ‘LGBTQ స్పోర్ట్స్ హాల్ ఆఫ్ ఫేమ్’ నుండి ‘గ్లెన్ బర్క్ అడ్వకేసీ & యాక్టివిజం అవార్డు’కు ఎంపికయ్యారు
ALSO READ Sparta 3 Mystery : అతి రహస్యం Andhra Prabha Top Story
