IND vs ENG | ఇంగ్లాండుపై చక్రవర్తి ప్రతాపం.. బ్యాటింగ్ లైనప్ ఫసక్

రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన‌ ఇంగ్లండ్… భారీ స్కోర్ నమోదు చేసింది. ఎలాగైనా మూడో మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జాస్ బట్లర్ జట్టు.. స్కోర్ బోర్డుపై 171 పరుగుల డిఫెండ‌బుల్ టార్గెట్ ను సెట్ చేసింది.

రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జోస్ బట్లర్ జట్టు స్కోరు బోర్డుపై 171 పరుగుల డిఫెండ‌బుల్ స్కోర్ సెట్ చేసింది.

ఓపెనర్ బెన్ డకెట్ (28 బంతుల్లో 51 అర్ధ సెంచరీ), మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ 24 బంతుల్లో 43 పరుగులతో చెలరేగిపోయారు. కెప్టెన్ జోస్ బట్లర్ 24 పరుగులతో ఆకట్టుకున్నాడు. బెన్ డకెట్, లివింగ్‌స్టోన్ చెల‌రేగి ఆడటంతో ఇంగ్లండ్ స్కోరు భారీగా నమోదైంది. వీరి సహకారంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వీరిద్దరూ మినహా ఎవరూ 10 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు.

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (5/24) ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, హార్దిక్ పాండ్యా (2/33), రవి బిష్ణోయ్ (1/46), అక్షర్ పటాటే (1/19) వికెట్లు తీశారు. ఇక 172 ప‌రుగుల టార్గెట్ తో టీమిండియా బ‌రిలోకి దిగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *