Nizamabad | దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం….

Nizamabad | దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం….

Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల దక్షిణ కాశీగా పేరుపొందిన సిద్ధిరామేశ్వర ఆలయం(Siddhi Rameshwara Temple)లో ఈ రోజు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

ఆలయంలో గల మూలబావి నీటితో భక్తులు తల స్నానాలు చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అభిషేకాలు, అర్చనలు(Abhishekams, Archanas) నిర్వహించారు. శివ నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. అభిషేకాల అనంతరం పలువురు జంటలు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన‌ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వాన అధికారి శ్రీధర్(Sridhar), ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.