Financial situation I దేశ పరిస్థితిపై నిజం చెప్పండి.. ప్రధానిని నిలదీసిన అరవింద్ కేజ్రీవాల్

Financial situation I దేశ పరిస్థితిపై నిజం చెప్పండి.. ప్రధానిని నిలదీసిన అరవింద్ కేజ్రీవాల్

Financial situation I ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితి , అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని చేసిన విజ్ఞప్తులపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

పెట్రోల్ వాడకం తగ్గించి, వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునివ్వడం వెనుక ఉన్న అసలు కారణమేంటో ప్రధాని వివరించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఆయన కోరారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉన్నప్పటికీ, ఇలాంటి అసాధారణ చర్యలు ఏ దేశంలోనూ లేవని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రతి విషయంలోనూ కేవలం మధ్యతరగతి ప్రజలపైనే ఎందుకు భారం వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సామాన్య ప్రజలను పొదుపు చేయమని కోరుతున్న ప్రభుత్వం, మంత్రులు, ఉన్నతాధికారుల ఖర్చుల్లో ఎందుకు కోత విధించడం లేదని నిలదీశారు. సామాన్యులకు నియమాలు విధిస్తూ, దేశంలోని బిలియనీర్లకు మాత్రం ఎందుకు ఎలాంటి విజ్ఞప్తులు చేయడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందా? లేదా ఇది ఏదైనా ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంకేతమా? అని కేజ్రీవాల్ అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply