Mexico plane crash | విమాన ప్రమాదం..

Mexico plane crash | విమాన ప్రమాదం..
Mexico plane crash, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మెక్సికోలోని టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయల్దేరిన ఓ మినీ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా విమానం స్పాట్‌లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణికులు మరణించారు.
ఈ ప్రమాదం జరిగిన సమీపంలో ఓ ఫుట్ బాల్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో పైలెట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నించారు కానీ.. విఫలం అయ్యాడు. స్టేడియం సమీపంలోని ఓ కంపెనీ పైకప్పు పై విమానం పడి పేలిపోయిందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
