NationalHighway44 | సీఎన్‌జీ కార్లతో వెళ్తున్న కంటైనర్‌కు మంటలు

NationalHighway44 | మెదక్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సీఎన్‌జీ కార్లను తరలిస్తున్న కంటైనర్ లారీకి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రహదారిపై భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

తూప్రాన్ బైపాస్ వద్ద వెళ్తున్న కంటైనర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కంటైనర్‌లో ఉన్న సీఎన్‌జీ కార్లు కూడా మంటల్లో చిక్కుకోవడంతో అగ్నిప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
