Miss India | విజేతగా సాధ్వి సతీశ్

Miss India | విజేతగా సాధ్వి సతీశ్
Miss India | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అందాల పోటీలో గోవా సుందరి విజేతగా నిలిచింది. మిస్ ఇండియా 2026 టైటిల్‌ను సాధ్వి సతీశ్ సైల్ సొంతం చేసుకుంది. శనివారం రాత్రి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కేఐఐటీ విశ్వవిద్యాలయంలో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో ఆమె ఈ ఘనతను సాధించారు. తదుపరిగా జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి సాధ్వి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆమెకు తీవ్రమైన పోటీ ఇచ్చిన రాజ్‌నందిని పవార్, అద్వైత ఈ పోటీల్లో మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. నిఖితా పౌర్వాల్, రేఖా పాండే, ఆయుషి ధోలకియా వంటి గత మిస్ ఇండియా విజేతల సమక్షంలో ప్రస్తుత విజేతలకు కిరీటధారణ జరిగింది. సాధ్వి సతీశ్ విషయానికొస్తే, ఆమె గోవాకు చెందిన మోడల్, ఎంట్రప్రెన్యూర్. ఇక రాజ్‌నందిని మహారాష్ట్ర వాస్తవ్యురాలు. తమిళ-తెలుగు మూలాలు కలిగిన అద్వైత భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతాల తరఫున పోటీచేశారు.


