మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు
ఎన్కౌంటర్లో చనిపోయినట్టు సమాచారం
34 మంది మావోయిస్టులు, ఒక పోలీస్ సహాయకుడు మృతి
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్
55 గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పులు
కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు
వివరాలు వెల్లడించని పోలీసు అధికారులు
శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ :
మావోయిస్టు పార్టీ సైనిక దళపతి, అగ్రనేత నంబాబ కేశవరావు.. అలియాస్ బసవరాజు ఇకలేరు. చత్తీస్ గడ్ లో మావోయిస్టులు, కేంద్ర భద్రతదళాల మధ్య బుధవారం తెల్లవారుజామున రాజుకున్న భీకర పోరులో 70 ఏళ్ల మావోయిస్టు కురువృద్ధుడు కేశవరావు నేలకూలారు. ఈ సమాచారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మావోయిస్టు కీలక అగ్రనేత పొలిట్ బ్యూరో సభ్యుడు నంబాల కేశవరావు మరణాన్ని అటు భద్రతదళాలు, ఇటు మావోయిస్టులు ద్రువీకరించలేదు. చత్తీస్ గఢ్ దండకారణ్యంలో (అబుజ్ మడ్) బుధవారం భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య భీకర యుద్ధంలో 34 మంది మావోయిస్టులు, ఒక పోలీస్ సహాయకుడు మృతి చెందినట్టు తాజా సమాచారం కలకలం రేపింది. చత్తీస్ గడ్ దంతెవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ..
మావోయిస్టు పార్టీ ఆర్మీ చీఫ్.. దళపతి నంబాల కేశవరావు మరణించినట్టు తీవ్ర ప్రచారం జరుగుతోంది. నక్సల్బరి సిక్కోలు బిడ్డ నంబాల కేశవరావు 1955 లో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేట గ్రామంలో జన్మించారు. వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీ టెక్ చదివారు. ఆయన కబడ్డీ క్రీడాకారుడు. ఆయన వామపక్ష విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. సీపీఐ -ఎంఎల్ (పీపుల్స్ వార్) 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కు నాయకత్వం వహించారు. అప్పుడు ఆర్ఎస్ ఎస్, ఆర్ఎస్ యూ మధ్య ఘర్షణలో మాత్రమే కేశవరావు అరెస్టు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన పోలీసులకు చిక్కలేదు. ఆయన పుట్టిన ఊరు జియన్నపేటలో ఆయన పేరిట ఆస్తి లేదు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ విద్యలో చేరాడు. అప్పుడే ఆయన మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితు డయ్యాడు .1984లో ఆయన ఎం టెక్ చదువుతూ నక్సలైట్ల ఉద్యమంలో చేరాడు. అప్పటి నుంచి ఆయన నక్సలైట్ల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మార్క్సిజం -లెనినిజం- మావోయిజం భావజాలానికి బలంగా కట్టుబడి ఉన్నాడు. అతను 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నాడు . 1980లో ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ ఏర్పడినప్పుడు, అతను కీలక నిర్వాహకులలో ఒకడు.
మన్యంలో తొలి కమాండర్
తూర్పు గోదావరి విశాఖపట్నం జిల్లాల్లోకి ప్రవేశించిన తొలి కమాండర్ ఆయన. రావు , మల్లోజుల కోటేశ్వరరావు ( కిషన్జీ) మల్లుజోల వేణుగోపాల్, మల్లా రాజి రెడ్డిలతో కలిసి 1987లో బస్తర్ అడవులలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) మాజీ యోధుల బృందం నుండి ఆకస్మిక దాడుల వ్యూహాలు, జెలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు. 1992లో, ఆయన పూర్వపు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్- లెనినిస్ట్) పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు . 2004లో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎసీసీఐ) విలీనం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఏర్పడినప్పుడు , సైనిక వ్యూహాలు పేలుడు పదార్థాల వాడకంలో, ముఖ్యంగా ఐఈడీల వాడకంలో తన నైపుణ్యం కారణంగా కేశవరావు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా , పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. నంబాల కేశవ రావుకు అనేక పేర్లు ఉన్నాయి. బసవరాజు, గగన్న అని పిలుస్తారు ఒక భారతీయ మావోయిస్టు రాజకీయవేత్త , కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం భారత జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్. 2018 నవంబర్ లో ముప్పాల లక్ష్మణరావు (అలియాస్ గణపతి ) రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యాడు.
గెరిల్లా నిపుణుడిగా రికార్డులు
ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, ఒడిశాలో జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక కూడా అతను ఉన్నట్లు అనుమానిస్తున్నారు . 2010లో ఛత్తీస్ గఢ్ జరిగిన ల్యాండ్ మైన్ పేలుళ్లలో 76 మంది సీఆర్పీఎఫ్ జవానులను మట్టు పెట్టిన ఘటనలో కేశవరావు కీలకపాత్ర పోషించినట్లుగా స్పష్టమైంది. అయనపై కోటిన్నర రూపాయిల రివార్డు కూడా ఉంది.2010 నుంచి కేశవరావును పట్టుకునేందుకు అటు కేంద్ర బలగాలు, ప్రత్యేక పోలీస్ బలగాలు కూడా ప్రయత్నిస్తూనే వచ్చాయి. పోలీసులు జరిపిన పలు ఎన్ కౌంటర్ల నుంచి నంబాల తప్పించుకున్నారు. చివరకు బుధవారం జరిగిన పోలీసుల ఎదురుకాల్పులలో నంబాల కేశవరావు తో పాటు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని ప్రచారం జరుగుతోంది ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన ప్రకారం, కేశవరవు గెరిల్లా యుద్ధం, కొత్త రకాల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ల వినియోగంలో బలమైన సైనిక వ్యూహాలను కలిగి ఉన్నాడు . అతను క్షేత్ర వ్యూహంలో దూకుడుగా ఉండటమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి శరవేశ్వర్ రావు హత్యకు కేశవరావే కారణమని పోలీసు వర్గాల సమాచారం . 2010లో దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 76 మంది సీఆర్‌పిఎఫ్ సైనికులు మరణించారు, జీరామ్ ఘాటి దాడిలో మాజీ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ ఛత్తీ స్ గఢ్ కాంగ్రెస్ నాయకుడు నంద్ కుమార్ పటేల్ సహా 27 మంది మరణించారు.. ఈ దాడులన్నింటిలోనూ కేశవరావు వ్యూహం ఉన్నట్టు పోలీసులు చెబుతుంటారు. ఇక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పై అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కు, బలిమెలలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఊచకోతకు కేశవరావే ప్రధాన సూత్రధారి