Machilipatnam | దుప్పట్లు పంపిణీ..

Machilipatnam | దుప్పట్లు పంపిణీ..

Machilipatnam, ఆంధ్రప్రభ : షేరింగ్ అండ్ కేరింగ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మచిలీపట్నంలోని సాయిబాబా గుడి లక్ష్మీ టాకీస్ సెంటర్ బైపాస్ రోడ్డులో ఎటువంటి ఆదరణ లేని వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అల్పాహారంతో పాటు చలికాలం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శీలం రత్నరాజు (రాజా శీలం)మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు చలికాలం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. దీంతో పాటు అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడం.. కరోనా సమయంలో నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించాం. మచిలీపట్నం పరిసర ప్రాంతంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకు వచ్చిన యువతకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాం. మున్ముందు తమ ట్రస్ట్ తరపున మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్ ఐ సి డెవలప్మెంట్ ఆఫీసర్ అడపాల సాయి కిరణ్, బోగాధి గోపిచంద్, యస్ సాయి కృష్ణ, జె సాయి తేజ, టీ. సుభాష్, మెరకనపల్లి సూర్య పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.