నిజాంపేటలో ఇంటిపై పిడుగుపాటు..

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలో గురువారం కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన పంజా శ్రీనివాస్ 4వ అంతస్తు బిల్డింగ్ పై పిడుగు పడడం జరిగింది. ఈ పిడుగుపాటు వల్ల బంగ్లా పై ఉన్నటువంటి పీలేరు వాటర్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకేసారి పెద్ద ధ్వనితో పిడుగు సౌండ్ తో ఇంట్లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఒకేసారి ఉలికి పడడం జరిగిందని ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదు. గ్రామంలో పిడుగు పడడం ఇది రెండవసారి కావడం విశేషం. అలాగే ఈ అకాల వర్షాలకు మండలంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడం వల్లనే రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply