22. ఆడపాడ నీవె ఆడించు వాడవే
సర్వమయినగాని శాంతియుతుడ
భక్తతతికి నీవె పరమాత్ముడవుగాన
గీతదాత నీకు కేలుమోడ్తు
23. సత్యభామయనగ చచ్చేంత భయమయ్య
ప్రార్థనమ్ము తోడ పాదసేవ
పారిజాత కలహఫలితమ్ము పాఠమ్ము
గీతదాత నీకు కేలుమోడ్త్తు
24. లలనయన్నచాలు లాలనయే మెండు
సర్వబాధలకును పూర్వమదియె
నీవుననుభవించి నిఖిలజగతికి చెప్ప
గీతదాత నీకు కేలుమోడ్తు