ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం..

డోంగ్లీ, ఆంధ్రప్రభ : మండలంలోని మోఘ, మారేపల్లి గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోంగ్లీ మండల అధ్యక్షుడు గజానంద్ దేశాయి హాజరై లబ్ధిదారులను అభినందించి, పూజా కార్యక్రమంలో పాల్గొని ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ యూనుస్ పటేల్, సలాబత్‌పూర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, సర్పంచ్‌లు బస్వరాజ్ పటేల్, సంగ్రామ్ పటేల్, శ్రీకాంత్, శ్రీధర్, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply