యువతకు ఉపాధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం,మహిళా సాధికారత,యువతకు ఉపాధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని నియోజకవర్గ శాసనసభ సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మండలంలోని కనుమూరు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేసిందని వివరించారు. ప్రభుత్వం సాధించిన విజయాలు,అర్హులకు అందజేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ విజయాల పత్రాలను పంపిణీ చేశారు.ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా నాయకులు శ్రేణులు ప్రజల్లో ఉంటారని ఉద్దేశంతో పార్టీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
