Iron Step Down : ఇరాన్​  రాజీ తంత్రం Andhra Prabha Analysis

Iron Step Down : ఇరాన్​  రాజీ తంత్రం Andhra Prabha Analysis

అమెరికా దూకుడు

 ఇరాన్​ వెనకడుగు

( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్​ వింగ్)

అణ్వాయుధ పరీక్షలతో.. తన అంబుల పొదిలోని  అణుక్షిపణులతో అణుక్షణం  అగ్ర రాజ్యాల్లో వణుకు పుట్టించిన.. ఇరాన్​ తన సొంతింటి కుంపటికి భయపడుతోంది. తాము సాధించిన  ఇస్లామిక్​ విప్లవం దారి మళ్లుతోందని కంగారు పడుతోంది. తమ దేశంలో రాచరికం బదులు ప్రజాస్వామ్యం వేళ్లూనుతుందని ఆందోళన చెందుతోంది.

Iron Step Down

ఇక వెనుజులాను అనధికారికంగా ఆధీనం చేసుకున్న అమెరికా.. తాజాగా ఇరాన్​ ను కైవశం చేసుకోవటానికి ఉవ్విళూరుతోంది. గత మూడు వారాలుగా ఇరాన్​ లో అంతర్గత అలజడి.. అంతర్జాతీయ సమాజంలో పెరుగుతున్న ఒత్తిళ్లకు లొంగక తప్పదని ఇరాన్​ భావిస్తోంది. తూచ్​ అణ్యాయుద పరీక్షలు అనే స్థితికి చేరగా.. ఆ దేశ సార్వభౌమత్యం మాత్రం పెను ప్రమాదంలో పడింది.    

Iron Step Down : ఇరుకుల్లో ఇరాన్​ ..

ప్రస్తుతం ఇరాన్‌ పరిస్థితి అత్యంత అస్థిరంగా .. సంక్షోభభరితంగా మారింది,  తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ప్రజావ్యతిరేకతతో నలిగి పోతున్న ఇరాన్​ తాజాగా అమెరికా సృష్టిస్తున్న  సైనిక ఉద్రిక్తతలతో సతమతం అవుతోంది.  ఆర్థిక వ్యవస్థ పతనం,  కరెన్సీ విలువ క్షీణతతో   డిసెంబర్ 28, 2025న  రగిలిన  ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు  దేశవ్యాప్తంగా  వ్యాపించాయి.  ఈ ఆందోళనలను ఇరాన్​ ప్రభుత్వం  కఠినంగా అణచివేస్తోంది.

Iron Step Down

 ఇప్పటికి  646 మంది మరణించారు. 10,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఇక్కడి అణిచివేత పరిస్థితులు బాహ్య ప్రపంచానికి తెలియకుండా  ఇరాన్ అధికారులు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను  పూర్తిగా నిలిపివేశారు. ఈ చర్యలపై సభ్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది  2025లో ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలను  యూకే, ఫ్రాన్స్   జర్మనీ  దేశాలు పునరుద్ధరించాయి,

Iron Step Down

ఇంఉకు ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలే కారణం.  మొత్తంగా, ఇరాన్  తట్టుకోలేని సవాళ్లను ఎదుర్కొంటోంది.  అంతర్జాతీయంగా ఏకాకి అవుతోంది. అమెరికా,  ఇజ్రాయెల్ నుండి సైనిక దాడుల ముప్పు తప్పదని గ్రహించిన ఇరాన్​  ప్రతిస్పందనగా   తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.

Iron Step Down : అమెరికా సై..

ఇరాన్ లో  ప్రజా నిరసనపై హింసకాండను  ఆపకపోతే సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని అమెరికా హెచ్చరించింది.  ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో  వాణిజ్యంపై 25 శాతం టారిఫ్ (సుంకం) చెల్లించకతప్పదని జనవరి 12, 2026న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​  ప్రకటించారు. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Iron Step Down

చమురు దిగుమతి చేసుకునే భారత దేశంపైనా ఈ టారిఫ్​ ఆంక్షల ఎఫెక్ట్​ తప్పదు.  ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం లేదా ఆ దేశంతో భారీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా కఠినమైన ఆంక్షలను విధిస్తోంది.  ఈ టారిఫ్​ లతో ఇరాన్‌కు ప్రపంచ దేశాల  ఆర్థిక మద్దతును పూర్తిగా కట్ చేయాలని అమెరికా లక్ష్యం. ఇరాన్ ఆర్థిక వెన్నెముక  చమురు ఎగుమతులను “సున్నా” (Zero) స్థాయికి తీసుకురావాలని అమెరికా  వ్యూహం అమలు చేస్తోంది.  

Iron Step Down : ఇక  రాజీ తంత్రం

తీవ్ర అశాంతి, అస్థిరత,  ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఆలోచనలో పడింది. దేశ ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతల్లో అనిశ్చితి ఒక కొలిక్కి తీసుకురావటానికి రాజీమంత్రం తప్పదని భావించినట్టు తెలుస్తోంది.  తన అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని,  ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుతూ  అమెరికాకు సంకేతాలు పంపింది. అయితే, అమెరికా అధికారులు మాత్రం  సైనిక చర్యతో సహా అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.

 Iron Step Down :  జనం అలజడి ఎందుకు?

డిసెంబర్ 28న, ఇరాన్‌లోని యువకులు, వ్యాపారులు  రాజధాని టెహ్రాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఇవి ఇప్పుడు కరాజ్, ఇస్ఫహాన్ , కుహ్దాష్ట్ వంటి అనేక నగరాలకు వ్యాపించాయి. పోలీసులు ,  నిరసనకారుల మధ్య ఘర్షణలు అనివార్యమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఇరాన్‌లో ద్రవ్యోల్బణం అతివేగంగా  పెరుగుతోంది. ద్రవ్యోల్బణం 42.5%కి పెరిగింది. ఆహార పదార్థాల ధరలు 72%  ఔషధాల ధరలు 50% వరకు పెరిగాయి.

Iron Step Down

ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో 62% పన్ను పెంపును కూడా ప్రతిపాదించింది.  ప్రభుత్వం కేంద్ర బ్యాంకు గవర్నర్‌ను తొలగించి, ద్రవ్యోల్బణానికి ఆయనను బాధ్యులుగా చేసి, కొత్త గవర్నర్‌ను నియమించింది. ఇరానియన్  రియాల్   అత్యల్ప స్థాయికి చేరింది.  డిసెంబర్ 2025లో, ఇరానియన్  కరెన్సీ డాలర్‌కు దాదాపు 42,000 రియాల్స్‌కు పడిపోయింది.

తాజాగా అమెరికా ఆంక్షలతో  ఇరాన్ కరెన్సీ ‘రియల్’ విలువ   డాలర్‌తో పోలిస్తే  1.65 మిలియన్ల రియాల్స్​ కు  చేరింది.  ఈ స్థితిలో.. ఇరాన్​ ప్రజల కొనుగోలు శక్తి నశించింది పోయింది. అందుకే అలజడి ఆరంభమైంది. దీనికి తోడు సర్కారు ఫత్వాలను జనం భరించలేక పోతున్నారు.   

Iron Step Down :  వాణిజ్య సవాళ్లు

2024లో ఇరాన్ మొత్తం ఎగుమతులు దాదాపు $22.18 బిలియన్లకు చేరుకున్నాయి, ప్రధానంగా చమురు నుండి, దిగుమతులు మొత్తం $34.65 బిలియన్లు, ఫలితంగా వాణిజ్య లోటు $12.47 బిలియన్లకు దారితీసింది.

Iron Step Down

2025లో తగ్గుతున్న చమురు ఎగుమతులు అంతర్జాతీయ ఆంక్షల కారణంగా లోటు మరింత $15 బిలియన్లకు పెరిగింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది, దాని చమురు రవాణాలో చైనా దాదాపు 90% వాటా కలిగి ఉంది. పొరుగు దేశాలతో INSTC కారిడార్ ద్వారా వాణిజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు ఉన్నప్పటికీ, 2025కి GDP వృద్ధి కేవలం 0.3%గా అంచనా వేయబడింది ఆంక్షల ఎత్తివేత లేదా పునరుద్ధరించబడిన అణు ఒప్పందం లేకుండా ఆర్థిక స్థిరీకరణ అనిశ్చితంగానే ఉంది.

Iron Step Down : అమెరికా బాధేంటీ ?

ఖతార్, ఇరాక్, సిరియా, జోర్డాన్, కువైట్ ,  సౌదీ అరేబియా   దేశాలలో అమెరికా సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఇరాన్ నియంత్రణలోని ఎర్ర సముద్ర మార్గంలో  అమెరికన్ చమురు ,  ఇతర వాణిజ్యం కూడా ప్రవహిస్తోంది.

Iron Step Down

ఈ ప్రాంతంలో అమెరికాకు స్థావరం లేని ఏకైక దేశం ఇరాన్. ఇరాన్‌లో అమెరికాకు అనుకూల  ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అమెరికా మొత్తం మధ్యప్రాచ్యంపై నియంత్రణ సాధిస్తుంది. ఇస్లామిక్ ప్రపంచ నాయకత్వం కోసం సౌదీ అరేబియా ,  ఇరాన్ మధ్య చాలా కాలంగా పోటీ ఉంది. సౌదీ అరేబియా తదితర అరబ్ దేశాలతో అమెరికా సైనిక, ఆర్థిక ,  దౌత్య సంబంధాలను కలిగి ఉంది. ఇరాన్ బలహీనపడటంతో, ఈ దేశాలతో అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయి.

– Iron Step Down  : అమెరికా కూటమికి బలం

Iron Step Down

 ఇరాన్ బలహీనపడితే, అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ అతిపెద్ద హక్కుదారుగా ఉంటుంది. ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపడితే, ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటివరకు, ఇజ్రాయెల్ అమెరికా ఆర్థిక  సైనిక సహాయంలో  లాభపడుతోంది.  కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) నివేదిక ప్రకారం, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుండి, అమెరికా దానికి USD 300 బిలియన్లకు పైగా  ( INR 25 లక్షల కోట్లకు) పైగా అందించింది.

Leave a Reply