ipl3may | ఇవాళ ఐపీఎల్‌లో డబుల్ హెడర్
ipl3may | ఇవాళ ఐపీఎల్‌లో డబుల్ హెడర్
మధ్యాహ్నం 3.30గంటలకు కోల్‌కతా, సన్‌రైజర్స్ ఢీ
రాత్రి 7.30గంటలకు గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య పోరు
ipl3may | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రెండు ఆసక్తికర మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 3.30గంటలకు కోల్‌కతా, సన్‌రైజర్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అలాగే రాత్రి 7.30గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్, పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్… ఈ మ్యాచ్ లో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బరిలో దిగుతోంది. ఈ సీజన్ లో 9 మ్యాచులాడి 6 మ్యాచులు గెలిచి పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది సన్ రైజర్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్, క్లాసెన్, నితీష్, సలీల్ అరోరా లాంటి హార్డ్ హిట్టర్స్ తో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్. ప్యాట్ కమ్మిన్స్ ఎంట్రీతో పాటు యువ బౌలర్లు కూడా రాణిస్తుండటంతో సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ పుంజుకుంది.
ఇక ఈ సీజన్ లో 8 మ్యాచులాడి కేవలం రెండు మ్యాచులు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 8వ ప్లేస్ లో ఉంది కేకేఆర్. టాప్ ఆర్డర్ వరుసగా ఫెయిల్ అవుతుండటంతో భారీ స్కోర్లు నమోదు చేయలేకపోతోంది కేకేఆర్. రింకు సింగ్ మినహా మిడిల్ ఆర్డర్ కూడా ఆకట్టుకోలేకపోతుండటంతో ఇబ్బందులు పడుతోంది కేకేఆర్. ఈ సీజన్ లో బెంచ్ కే పరిమితమైన రచిన్ రవీంద్రను ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశం ఉంది.
