డిప్యూటీ తహశీల్దార్ ఎన్.అనురాధకు ఉత్తమ సేవా పురస్కారం
యడ్లపాడు, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు యడ్లపాడు డిప్యూటీ తహశీల్దార్ ఎన్.అనురాధకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఆమె ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు అనురాధకు ఈ పురస్కారం దక్కింది. ఆమెకు ఉత్తమ సేవా పురస్కారం లభించడంపై రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
