అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం: కార్పొరేటర్లు
నల్గొండ, ఆంధ్రప్రభ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నల్గొండ కార్పొరేటర్లు ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డి, గుమ్మల జానకి మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 13, 34 డివిజన్లలో వేముల పెద్దలింగయ్య, సునీత దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని వారు ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు.
ప్రజాపాలనలో రేషన్ కార్డులు, సన్నబియ్యం, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో 13వ డివిజన్ ఇన్‌చార్జి కంచరకుంట్ల వెంకట్‌రెడ్డి, వార్డు ఆఫీసర్ అఖిల్, కత్తుల రాంబాబు, దోనాల నాగార్జునరెడ్డి, హరి, నాగవెల్లి రమేష్ గౌడ్, శ్యామ్, ఊటుకూరి దేవిరెడ్డి, గోవర్ధనగిరి, బొజ్జ వెంకన్న, మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించగా, పాస్టర్లు సీమోను, మురళి, జయచంద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
