వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుతమైన సెంచరీ క‌దం తొక్కాడు. ప్ర‌స్తుతం 140 ప‌రుగుల‌తో క్రీజ్‌లో ఉన్నాడు. జట్టు స్కోరు 58 పరుగుల వద్ద మ‌రో ఓపెనర్ కేఎల్ రాహుల్(38) పరుగుల వద్ద వారికన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతనికి సాయి సుదర్శన్ 87 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు. జైశ్వాల్‌కు తోడుగా కెప్టెన్ శుభ‌మ‌న్‌గిల్ క్రీజ్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉండగా, యశస్వీ జైస్వాల్ కెరీర్‌లో ఏడవ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. వెస్టిండీస్‌పై తన అరంగేట్ర టెస్టులో జూలై 2023లో సెంచరీ చేశాడు. కేవలం 24 ఏళ్ల లోపు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్‌గా గ్రేమ్ స్మిత్ రికార్డును జైస్వాల్ సమం చేశాడు. ముంబైకి చెందిన ఈ 23 ఏళ్ల ఓపెనర్.. జావేద్ మియాందాద్, అలిస్టర్ కుక్, కేన్ విలియమ్సన్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. వారందరూ కూడా 24 ఏళ్లు నిండకముందే ఏడు టెస్ట్ సెంచరీలు సాధించారు. భారత ఓపెనర్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు కావడం గమనార్హం.

Leave a Reply