వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర
వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాల జాతర
చిట్యాల, ఆంధ్రప్రభ: గీతా కార్మికుల ఆరాధ దైవమైన రేణుక ఎల్లమ్మ కంఠమహేశ్వర స్వామి , ఐదో వార్షికోత్సవ ఉత్సవాలు, గత నాలుగు రోజులుగా పూజార్ల వేదమంత్రోత్సవాల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి, తల్లి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని గౌడ కుటుంబాలు వేడుకున్నారు. గౌడ సంఘం మండల అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో గౌడ కులస్తులు,కుటుంబ సభ్యులతో మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు సప్పుల్లా ,పోతురాజుల విన్యాశుల, నడుమ ర్యాలీగా వెళ్లారు.
డీజే తో పలువురు నృత్యా లను అలరించారు. మహిళలు, జన జాతర్ల ఎల్లమ్మ తల్లి బోనాలను, బెల్లం, ప్రసాదంతో, చింతలపల్లె, చిట్యాల, మీదుగా దేవాలయం వరకు రెండు కిలోమీటర్ల మేర డప్పు చప్పులు , డీజే లు నృత్యాలు, చేసుకుంటూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం చేరుకున్నారు. అనంతరం పూజలు పూజారులు ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు . దీంతో గౌడ కుటుంబాలు మొక్కులు తల్లికి చెల్లించుకున్నారు. పాడిపంటలు బాగుండాలని , గౌడ కులస్తులు,ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆ తల్లిని వేడుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. కార్యక్రమంలో గౌడ సంఘం ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల రాజు, డైరెక్టర్లు గుర్రపు రాజు, బుర్ర నరేష్, బుర్ర రాజకుమార్ , ఆముదాల పెళ్లి శ్రీనివాస్, ,గౌడ సంఘం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
