Hacking | అభిజీత్ దీప్కేపై దుండగుల దాడి.. ముఖానికి గాయాలు

Hacking | అభిజీత్ దీప్కేపై దుండగుల దాడి.. ముఖానికి గాయాలు

Hacking | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దుండగులు దాడి చేశారు. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యలపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఆయన ముఖంపై దాడి చేసి గాయపరిచి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని సమాచారం. వెంటనే బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

గత నెలలో కూడా అభిజీత్ దీప్కేకు బెదిరింపులు వచ్చాయని, అలాగే ఆయన సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. నిరసనల సమయంలో తగిన భద్రత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.