బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
దండెపల్లి, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బిజెపి ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కన్నెపల్లి నుంచి ముత్యంపేట వరకు ఉత్సాహంగా సాగింది.జాతీయ జెండాలను చేతబట్టుకొని బిజెపి నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తిని చాటుతూ జాతీయ జెండాలతో ర్యాలీ ముందుకు సాగగా, మార్గమధ్యంలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వం, జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉప అధ్యక్షుడు ముత్తే సత్తయ్య, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గొపతి రాజయ్య, మండల అధ్యక్షుడు రవిగౌడ్, ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్, పిఎసిఎస్ చైర్మన్ బెడద సురేష్,ఉప అధ్యక్షులు ఎర్రం విజేందర్, ఢంకా లక్ష్మణ్, రాకేశ్,తులసి మాజీ ఉపసర్పంచ్ లు నలిమెల మహేష్, ముత్తే వెంకటేష్, దుమ్మని సత్తయ్య, నాయకులు బియ్యల సతీష్ రావు,మల్లేష్, గిరిధర్, కుమార్, హరిక్రిష్ణ, శ్రీనివాస్, దిలీప్, మొండయ్య, బుచ్చన్న, తది తరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
