ఎఫ్‌బీఓ ఉద్యోగాల లక్ష్యంగా యువతకు ఉచిత కోచింగ్..

ఎఫ్‌బీఓ ఉద్యోగాల లక్ష్యంగా యువతకు ఉచిత కోచింగ్..

ఉట్నూర్ డిగ్రీ కళాశాల ముందడుగు

ఉట్నూర్ , ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డిగ్రీ కళాశాల సామాజిక బాధ్యత (సీస్సార్ ) కార్యక్రమంలో భాగంగా, ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వారు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ( ఎఫ్బీఓ) పోస్టుల నియామకాలకై ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ ఆదివారం తెలిపారు.

ఉచిత కోచింగ్ 10 నుండి ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామీణ ప్రాంతాల యువతకు అవగాహన కల్పించడం, సరైన మార్గదర్శకత్వం అందించడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అవసరమైన సన్నద్ధత కల్పించడం మా కళాశాల ప్రధాన లక్ష్యం.మన్నారు.

ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అర్హత గల ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత కోచింగ్‌లో చేరాలని ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ కోరారు.

విద్య అవగాహన, ఉపాధి అవకాశాల ద్వారా ఉజ్వల భవిష్యత్తు వైపు. కృషి చేస్తున్నామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎఫ్బీఓ ఉచిత శిక్షణకై ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాల లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం డాక్టర్ నర్సింగ్ రావు , డాక్టర్ రాణి 9441012766, 9492280888 సంప్రదించాలని ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ కోరారు.

Leave a Reply