బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..

బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..

పందిగోలీలు కొరికిన మూడు గేదెలకు తీవ్రగాయాలు..
వన్యప్రాణుల కోసం పంది గోలీలు పెట్టారనే అనుమానం..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి గోదావరిరేవులో పంది గోలీలు కొరికి మూడు గేదెలకు తీవ్ర గాయాలైన విషాదకర సంఘటన ఇది. గ్రామానికి చెందిన పశువుల కాపర్లు దుమల్ల కేశన్న, దుమల్ల నారాయణ, గొట్ల లింగన్నలు గ్రామానికి చెందిన రైతుల సుమారు 400 గేదెలను గోదావరినది తీరప్రాంతానికి మేత కోసం ఆదివారం కొట్టుకెళ్లారు.

ఆ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు వన్యప్రాణుల వేట కోసం పెట్టిన పంది గోలీలను గ్రామానికి చెందిన మల్లెపల్లి శంకరయ్య, గడిపెల్లి నర్సయ్య, సామల్ల రాజన్నల మూడు గేదెలు కొరకగానే ఆ పంది గోళీలు నోట్లోనే పేలి ముఖ భాగం నుజ్జునుజ్జు అయి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పశువుల కాపర్లు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగానే గ్రామస్తులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు.

దీంతో స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ సంఘటన స్థలానికి మధ్యాహ్నం చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో మూడు గేదెలకు మూతి భాగంలో నుజ్జునుజై తీవ్రగాయాలు అయ్యాయని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Leave a Reply