మెరుగైన వైద్యం కోసం..
ఎల్ ఓ సీ పత్రాలు అందజేత
(భవానిపురం, ఆంధ్రప్రభ ) : ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బీజేపీ మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. ప్రైజర్ పేటకు చెందిన రెడ్డిబోయిన మోజెస్ (68) హృద్రోగంతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీని కూటమి నేతలతో కలిసి అందజేశారు.
46వ డివిజన్, అలీ నగర్ కు చెందిన మహమ్మద్ అహ్మద్ భాష మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా.. మంజూరైన రూ.4 లక్షల 51 వేల విలువైన ఎల్ ఓ సీని అందజేశారు.. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీని అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షర్మిల, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
