FOG | విమానాల రాకపోకలకు అంతరాయం

FOG | విమానాల రాకపోకలకు అంతరాయం
FOG | గన్నవరం, ఆంధ్రప్రభ : గన్నవరం ఎయిర్ పోర్టులో శుక్రవారం ఉదయం పొగమంచు (FOG) తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల నుంచి రావాల్సిన విమానాలు ల్యాండింగ్ కావడానికి వీలులేకపోవడంతో గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాలు సకాలంలో చేరుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని సర్వీసులు రద్దైయ్యాయి.
